చుచుంద్‌లో ముగిసిన సప్తాహ

ABN , First Publish Date - 2021-12-04T06:59:47+05:30 IST

మండలంలోని చుచుంద్‌ గ్రామంలోని సిద్ధేశ్వర ఆలయంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహ శుక్రవారంతో ముగిసింది.

చుచుంద్‌లో ముగిసిన సప్తాహ
సప్తాహ వేడుకల్లో చుచుంద్‌ వీధుల్లో భజనలు చేస్తున్న భక్తులు

భారీసంఖ్యలో  హాజరైన భక్తులు

భైంసా రూరల్‌, డిసెంబరు 3 : మండలంలోని చుచుంద్‌ గ్రామంలోని సిద్ధేశ్వర ఆలయంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా పలువురు మహరాజ్‌లు భక్తిమార్గంపై భక్తులకు మార్గదర్శనం చేశారు. భక్తులు తులసీమాలలు ధరించి భక్తిమార్గంలో నడవాలన్నారు. ప్రతీఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  అనంతరం ఆలయంలో ఉట్టి కొట్టి భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. గత వారం రోజులుగా సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్న మహరాజ్‌లకు ఆలయ, గ్రామకమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సిద్దేశ్వర ఆలయంలో ప్రతియేటా కార్తీక మా సం సందర్భంగా ఆలయంలో జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-12-04T06:59:47+05:30 IST