వ్యాక్సిన్ వేయించుకోవాలి
ABN , First Publish Date - 2021-10-28T05:50:16+05:30 IST
ర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్‌భాషాషేక్ అన్నారు. బుధవారం మండలంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లను పరిశీలించారు.

అదనపు కలెక్టర్ రిజ్వాన్‌భాషా షేక్
ఉట్నూర్, అక్టోబరు 27: అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్‌భాషాషేక్ అన్నారు. బుధవారం మండలంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లను పరిశీలించారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోనేలా బృందాలు పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, కార్యదర్శి సత్యనారాయణలు ఉన్నారు.
వందశాతం పూర్తిచేయాలి
ఫ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్
సిరికొండ, అక్టోబరు 27: సిరికొండ గ్రామపం చా యతీలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని మండల ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం సిరికొండ గ్రామ పంచాయతీ కార్యాల యం పరిధిలో ఇంటింటిసర్వే కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని గ్రామస్థులకు అవగా హన కల్పించారు. వ్యాక్సిన్ వేసుకునేలా పకడ్బందీ గా చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలో వందశాతం కరోనా వ్యాక్సిన్ పూర్తయ్యేలా సర్పంచ్ లు, ఉపసర్పంచ్‌లు, కార్యదర్శులు, కృషి చేయాల న్నారు. అంతకు ముందు మండలంలోని రిమ్మ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ గ్రామసభ నిర్వ హించి, మెగా పార్కును పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో ఎంపీడీవో సురేష్, ఎంపీవో అతుల్‌కుమార్, ఉపసర్పంచ్ రాజన్న, మాజీ సర్పంచ్ ఓరుగంటి పెంటన్న, రిమ్మ సర్పంచ్ అనిల్‌కుమార్, పంచా యతీ కార్యదర్శులు పురుషోత్తం, దుర్గయ్య, శ్రీనివా స్, అరుణ్‌కుమార్, అంగన్వాడీ టీచర్ రాణి, ఆశా కార్యకర్త జ్యోతి, చిత్రు, గ్రామస్థులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.