బుద్ధుడి బోధనలు మానవాళికి ఆదర్శం
ABN , First Publish Date - 2021-10-22T03:36:41+05:30 IST
బుద్ధుడి బోధ నలు ప్రపంచ మానవాళికి ఆదర్శనీయ మని ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జేత్‌వాన్ బుద్ధ విహా ర్‌లో నిర్వహించిన 32వ వర్షవాస్ ముగింపు కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

- ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్‌కుమార్
వాంకిడి, అక్టోబర్ 21: బుద్ధుడి బోధ నలు ప్రపంచ మానవాళికి ఆదర్శనీయ మని ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జేత్‌వాన్ బుద్ధ విహా ర్‌లో నిర్వహించిన 32వ వర్షవాస్ ముగింపు కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతకుముందు గౌతమబుద్ధుడు, డాక్టర్‌బీఆర్ అంబే ద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు ప్రతిఒక్కరూ అనుస రించి శాంతిమార్గంలో పయనించాలన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ అధ్యక్షుడు అశోక్, మండల నాయకులు ఉప్రెజైరాం, రాజేశ్వర్, విలాస్, పాండుజీ, రోషన్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.