రైతులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-20T03:39:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాసంగి పంటల విషయంలో రైతులను సీఎం కేసీఆర్‌ అయోమయానికి గురి చేస్తున్నారన్నారు.

రైతులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపి జిల్లా ఇన్‌చార్జి గంగారెడ్డి

ఏసీసీ, డిసెంబరు 19: రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాసంగి పంటల విషయంలో రైతులను సీఎం కేసీఆర్‌ అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతులు ఏ పంట పండించాలో తెలియని పరిస్థితి నెలకొం దన్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఆ నెపాన్ని కేం ద్రంపై నెడుతున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ చేయకుండా మూడు సంవత్సరాలు గడుస్తున్నా హామీలను తుంగలో తొక్కారన్నారు. రైతులకు పంట నష్టం జరిగినప్పుడు కేంద్రం అందించే ఫసల్‌ భీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు చేయనందున రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆక్రోశం వెళ్లగక్కారు.  జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా భూకబ్జాలు, అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. నాయకులు రజనీజైన్‌, పురుషోత్తం, పోశం, రవీందర్‌ రావు, వెంకటేశ్వర్‌రావు, వాణి, శ్రీదేవి, రమణరావు, తుల మధుసూధన్‌రావు, హరికృష్ణ, ప్రదీప్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి 

హాజీపూర్‌: గ్రామాల్లో బూత్‌స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని  జిల్లా ఇన్‌చార్జి గంగారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీని బలోపేతం చేయడానికి ప్రతీ ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.  జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌, మండల అధ్యక్షుడు తిరుపతి, నాయకులు వెంకటరమణరావు, తిరుపతి, సతీష్‌, కేశవరెడ్డి, నర్సింగరావు, పాల్గొన్నారు. 

జన్నారం: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ అన్నారు. ఆదివారం ఎస్‌కె గార్డెన్‌లో నిర్వహిం చిన మండల కార్యవర్గ సమావేశానికి  హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నియం త ప్రభుత్వం కొనసాగుతుందని, పల్లె స్థాయిలో బీజేపీ పటిష్టమవుతుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల న్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనన్న భయంతోనే కేసీఆర్‌ ఎన్నడు పెట్టని విధంగా ప్రెస్‌మీట్‌లు పెడుతూ ప్రత్యక్ష, పరోక్ష ఆరోపణలను చేస్తున్నా రన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉందని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఇది కలిసి వస్తుందన్నారు. జిల్లా ఇన్‌చార్జి గంగారెడ్డి, మండల ఇన్‌చార్జి శ్రీని వాస్‌, మండలాధ్యక్షుడు గోలి చందు, మాజీ సర్పంచు బద్రి, ఎంపీటీసీ శంక రయ్య, నాయకులు గంగాధర్‌, రమేష్‌గౌడ్‌, లచ్చన్న, సూర్యం పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-20T03:39:04+05:30 IST