రైతుల సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2021-07-09T04:05:10+05:30 IST
రైతుల సేవలు మరువలేనివని, రైతు పం టలు పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుందని లయన్స్‌క్లబ్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైటెక్‌సిటీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి గజ్జెల్లి వెంకటయ్యలు అన్నారు. గురువారం హైటెక్‌సిటీలో రైతుల దినోత్సవాన్ని నిర్వహించారు. శివ్వారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్, ఆడెపు శ్రీకాంత్ ఉత్తమ రైతులను సన్మానించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 8: రైతుల సేవలు మరువలేనివని, రైతు పం టలు పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుందని లయన్స్‌క్లబ్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైటెక్‌సిటీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి గజ్జెల్లి వెంకటయ్యలు అన్నారు. గురువారం హైటెక్‌సిటీలో రైతుల దినోత్సవాన్ని నిర్వహించారు. శివ్వారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్, ఆడెపు శ్రీకాంత్ ఉత్తమ రైతులను సన్మానించారు. వారు మాట్లాడుతూ రైతులు శ్రమించి పంటలు పండిస్తేనే దేశానికి కరువు ఉండదని, లేదంటే ఆహార కొరతతో ప్రజలు ఇబ్బందుల పాలు కాక తప్పదన్నారు. రైతుల సేవలను మార్గదర్శకంగా తీసుకోవాలని, ప్రభుత్వం వారికి గిట్టుబాటు ధర అందజేయాలన్నారు. నాయకులు మల్లారెడ్డి, మడుపు రామ్‌ప్రకాష్, దుర్గం రాజేశం గౌడ్, హన్మంతరావు, పోశమల్లు, నరోత్తమ్‌రావు తదితరులు పాల్గొన్నారు.