వీడీసీల దుమారం

ABN , First Publish Date - 2021-09-03T04:27:13+05:30 IST

జిల్లాలోని పలు గ్రామాల వీడీసీల వ్యవహారం దుమారం రేపుతోంది. వీడీసీలు ఇచ్చే తీర్పుల కారణం గా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఆ వ్యవస్థపై ముప్పు తెస్తోంది. ఇటీవల సోన్‌ మండలంలోని ఓ గ్రామస్థులు అ క్కడి వీడీసీ తీర్పుతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఉదాంతం అంతటా కలకలం రేపుతోంది.

వీడీసీల దుమారం
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు పోశెట్టి (ఫైల్‌)

గ్రామాల్లో కొనసాగుతున్న సమాంతర వ్యవస్థ 

ప్రజాప్రతినిధులు సైతం బలాదూర్‌ 

అనధికారిక టెండర్లు, తీర్పులతో జనం బెంబేలు 

బెల్ట్‌ షాపులు, ఇసుక క్వారీలతో ఆదాయ వనరులు 

పలువురు వీడీసీ సభ్యులపై కేసుతో కలకలం

నిర్మల్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):  జిల్లాలోని పలు గ్రామాల వీడీసీల వ్యవహారం దుమారం రేపుతోంది. వీడీసీలు ఇచ్చే తీర్పుల కారణం గా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఆ వ్యవస్థపై ముప్పు తెస్తోంది. ఇటీవల సోన్‌ మండలంలోని ఓ గ్రామస్థులు అ క్కడి వీడీసీ తీర్పుతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఉదాంతం అంతటా కలకలం రేపుతోంది. 

అనేక ఆరోపణలు..

పలు గ్రామాల్లోని  వీడీసీలు నిర్వహిస్తున్న అనధికారిక కార్యకలాపా లపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. గ్రామాల్లో ఈ వీడీసీలు అన్ని తా మై సమాంతర వ్యవస్థను  కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లోని ఆదాయ వనరులను తమ గుప్పిట్లోకి తీసుకొని ఆ వనరుల ద్వారా పెద్ద మొత్తంలో నిధులను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. 

శాసించే స్థాయికి గ్రామాభివృద్ధి కమిటీలు..

పంచాయతీ తీర్పునివ్వడం, రియల్‌ ఎస్టేట్‌ దందాల్లో సెటిల్‌మెంట్‌ లు చేయడం.. తమ తీర్పును ధిక్కరించే వారిపై బహిష్కరణల వే టు వేయడం, భారీ జరిమానాలు విధించడం వంటి చట్ట వ్యతిరే ఖ కార్యకలాపాలు చేపడుతూ కొన్ని వీడీసీలు రోజు రోజుకూ వివాదాల ఊబిలో చిక్కుకుంటున్నాయి. గ్రామాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలపై సైతం వీడీసీలు శాసించే స్థా యికి ఎదిగాయంటున్నారు. గ్రామాల్లో ఏర్పాటయ్యే బెల్ట్‌ షాపులకు వీడీసీల అనుమతి తప్పనిసరి అ వుతోంది. దీని కోసం గానూ బహిరంగంగా వే లంపాటలు నిర్వహించి వేలం పాటదారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాగులు, చెరువుల్లో గల ఇసుక క్వారీలను సైతం వేలం పాటలు నిర్వ హించి నిధులను సమీకరిస్తున్నా యి. ఈ తతంగమంతా చ ట్టవి రుద్ధంగా బాహాటంగానే కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు లేదంటున్నారు. కొన్ని గ్రామాల్లో మాత్రం వీడీసీలు ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా కొనసాగుతూ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నాయి. కొ న్ని గ్రామాల్లో మాత్రం వీడీసీలు ఆధిపత్య ధోరణి తో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా వ్యవహారిస్తున్నాయన్న విమర్శలున్నాయి. బెల్ట్‌షాపులు ఇసుక క్వా రీలే కాకుండా తమ గ్రామాల్లో కూల్‌డ్రింక్స్‌ షాపులు, చికెన్‌ సెంటర్‌లను నిర్వహించుకునేందుకు కూడా వీడీసీల అనుమతి తప్పనిసరి అవుతోంది. గ్రామాల్లో పంచాయతీల పేరిట ఇస్తున్న తీర్పులు పలు సందర్భాల్లో వివాదాస్పదమై పోలీస్‌ స్టేషన్‌లకు చేరుకుంటున్నాయి. పోలీసులు మా త్రం వీడీసీలపై తమకు అందే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకొని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని గ్రామాల వీడీసీలు మాత్రం తమ ప్రాబాల్యాన్ని ప్రదర్శించుకుంటూ ప్రజా ప్ర తినిధులను డమ్మీ చేస్తుండడమే కాకుండా అక్కడి తమ మాట వినని ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయ న్న వాదనలున్నాయి. కాగా, ఈ వీడీసీల్లో అక్కడి గ్రామంలోని ఒక్కో కులానికి చెందిన ఒకరు సభ్యులుగా ఉంటున్నారు. 

సమాంతర వ్యవస్థ..

కొన్ని గ్రామాల్లో వీడీసీలు తమ గ్రామా ల అభివృద్ధికి పాల్పడుతుండగా మరికొన్ని గ్రామా ల్లో మాత్రం ప్రజాప్రతినిధులను డమ్మీగా చేస్తూ స మాంతర వ్యవస్థను నడుపుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎం పీపీలు, జడ్పీటీసీలను వీడీసీలు శాసిస్తున్నాయి. గ్రామాల్లో పంచాయతీ లు పెట్టి తీర్పులిస్తుండడమే కాకుండా తమ తీర్పును ధిక్కరించి న వారికి భారీ జరిమానాలు, గ్రామ బహిష్కరణలు చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఇలాంటి వ్యవహారాలతో వీ డీసీలు న్యాయపరమైన వివాదాల్లో సైతం చిక్కుకుంటున్నాయి. గ్రామంలోని అన్ని కులాలకు చెందిన ఒక్కో సభ్యుడు ప్రతీ రెండేళ్లకు ఒకసారి వీడీసీలకు  స భ్యులుగా ఎన్నికవుతుంటారు. వీరు అంతా తా మై వ్యవహారిస్తూ తాము చెప్పిందే వేదంగా చెలామణి అవుతున్నట్లు ఫిర్యాదులున్నా యి. పల్లెల్లో వీడీసీల పేరు చెబితేనే మొ త్తం జడుసుకునే పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో మాత్రం వీడీసీలు కేవలం గ్రామాభివృద్ధికి పాల్పడుతూ ప్రజాప్రతినిధులను సముచితంగా గౌరవిస్తున్నాయన్న వాదనలున్నాయి. 

ఆదాయ వనరులపై నజర్‌

ప్రధాన ఆదాయ వనరులపై వీడీసీలు దృ ష్టి సారించడమే కాకుం డా అనైతిక వ్యవహారాలకు పాల్పడుతున్నాయన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో మద్యం, బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేయించి వేలం పాటలు ని ర్వహిస్తున్నాయి. దీని ద్వారా పెద్దమొత్తంలో డ బ్బులు సమకూర్చుకుంటున్నాయి. ఇలా బెల్ట్‌ షాపులతో పాటు గ్రామ సమీపంలోని వాగులకు సైతం టెండర్‌లను నిర్వహించి ఇసు క తవ్వకాలు, తరలింపునకు అనుమతినిస్తున్నాయి. దీని కోసం కూడా పెద్దఎత్తు న టెండర్‌లను నిర్వహించి అనుమతులనిస్తున్నాయి. ఇలా ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతున్న గ్రామ కమిటీలు తమ గ్రామ పరిధిలోని ఇలాంటి టెండర్‌లను నిర్వహించి అభివృద్ధి పనుల పేరిట లక్షల రూపాయలను సేకరిస్తున్నాయంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో బెల్ట్‌ షాపులు, ఇసుక క్వారీలకే కాకుండా కూల్‌డ్రింక్‌ షాపులు, చికెన్‌ సెంటర్‌లు, కల్లు దుకాణాల ఏర్పాటుకు కూడా వీడీసీ లు వేలం పాటలు నిర్వహిస్తున్నాయంటున్నారు.

పలువురిపై కేసు నమోదు..

ఇటీవల సోన్‌ మం డలంలోని ఓ గ్రామం లో అక్కడి వీడీసీ ఇచ్చిన తీర్పు పట్ల ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఉదాంతం వీడీసీల కార్యకలాపాల తీవ్రతను వెలువరిస్తోంది. పోలీసులు ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించి ఆత్మహత్యకు కారకులైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడీసీ సభ్యులపై కేసులు నమో దు చేశారు. మరికొన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నారు. 

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు..

ప్రవీణ్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ 

కొన్ని గ్రామాల్లో వీడీసీల పేరిట ఏర్పాటవుతున్న కమిటీలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి. ఇలాంటి ఫిర్యాదులపై సీరియస్‌ చర్యలు తీసుకుంటాం. చట్టవ్యతిరేక చర్యలకు పా ల్పడవద్దు. కుల బహిష్కరణలు, వేలం పాటలు నిర్వహించవద్దు.

Updated Date - 2021-09-03T04:27:13+05:30 IST