మధ్యాహ్నభోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-26T03:35:05+05:30 IST

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకలదాసు డిమాండ్‌ చేశారు. దండేపల్లిలో మధ్యాహ్నభోజన కార్మికులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని సం దర్శించి మద్దతు పలికారు. మధ్యాహ్నభోజన కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలన్నారు.

మధ్యాహ్నభోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
దండేపల్లిలో మధ్యాహ్నభోజన కార్మికులకు మద్దతుగా దీక్షలో కూర్చొన్న ఏఐటీయూసీ నాయకులు.

దండేపల్లి, డిసెంబరు 25: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకలదాసు డిమాండ్‌ చేశారు. దండేపల్లిలో మధ్యాహ్నభోజన కార్మికులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని సం దర్శించి మద్దతు పలికారు. మధ్యాహ్నభోజన కార్మికులకు కనీస వేతనం    రూ.21 వేలు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మెస్‌ బిల్లులను చెల్లించాల న్నారు. వారికి వైద్య సౌకర్యంతోపాటు ప్రమాదబీమా, పింఛన్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచాలన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. సంఘం నాయకులు మేదరి దేవవరం, రమణారెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T03:35:05+05:30 IST