పిచ్చుకల సందడి
ABN , First Publish Date - 2021-12-27T03:59:04+05:30 IST
మండల కేంద్రంలోని మినీస్టేడియం గ్రౌండ్‌లో ఉన్న విద్యుత్‌తీగలపై ఆదివారం ఉదయం పిచ్చుకలు కనువిందు చేశాయి. వందల సంఖ్యలో పిచ్చుకలు విద్యుత్‌తీగలపై వరుసక్రమంలో వాలాయి.

కౌటాల, డిసెంబరు 26: మండల కేంద్రంలోని మినీస్టేడియం గ్రౌండ్‌లో ఉన్న విద్యుత్‌తీగలపై ఆదివారం ఉదయం పిచ్చుకలు కనువిందు చేశాయి. వందల సంఖ్యలో పిచ్చుకలు విద్యుత్‌తీగలపై వరుసక్రమంలో వాలాయి. ఒక దాని తరువాత ఒకటి అర కిలోమీటర్ తీగల పొడవున వాలి చూపరులను ఎంతగానో ఆకట్టుకు న్నాయి. దీంతో యువకులు, చిన్నా రులు పిచ్చుకలను తమ సెల్‌ఫోన్‌లతో ఫొటోలు, వీడియోలు తీయడంలో పోటీపడ్డారు.