కడెం ప్రాజెక్టు వరదగేట్ల ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-20T06:44:56+05:30 IST

నిర్మల్‌ జిల్లాలో అతిపెద్దదైన కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరువచ్చి చేరుతోంది.

కడెం ప్రాజెక్టు  వరదగేట్ల ఎత్తివేత
కడెం ప్రాజెక్టు వద్ద వరదగేట్ల ఎత్తివేయడంతో వరదనీటి పరుగు

52,469 క్యూసెక్యుల నీరు గోదావరిలోకి విడుదల

కడెం, ఆగస్టు 19 : నిర్మల్‌ జిల్లాలో అతిపెద్దదైన కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరువచ్చి చేరుతోంది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల ప్రాజెక్టులోకి 55849 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఆరువరద గేట్లు ఎత్తి 52469 క్యూసె క్యుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 కాగా ప్రస్తుతం 696.500 నీటి మట్టానికి చేరుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రాజెక్టు పరిస్థితిని పర్యవేక్షిస్తు న్నారు. నీటి ఉత్పత్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 


Updated Date - 2021-08-20T06:44:56+05:30 IST