తర్నం మలుపు వద్ద బస్సును ఢీకొట్టిన లారీ

ABN , First Publish Date - 2021-11-09T05:33:27+05:30 IST

జైనథ్‌ మండలంలోని తర్నం గ్రామ మలుపు వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. టీఎస్‌01యూసీ3735 నెంబర్‌ గల లారీ మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ వైపు అతివేగంగా వస్తుండగా.. తర్నం మలుపు వద్ద మరో వాహనాన్ని తప్పించి ఎదురుగా వస్తున్న

తర్నం మలుపు వద్ద బస్సును ఢీకొట్టిన లారీ
రిమ్స్‌లో క్షతగాత్రున్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే

15 మందికి స్వల్ప గాయాలు.. రిమ్స్‌కు తరలింపు

జైనథ్‌/ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 8: జైనథ్‌ మండలంలోని తర్నం గ్రామ  మలుపు వద్ద సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురికి స్వల్ప గాయాలు కాగా ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. టీఎస్‌01యూసీ3735 నెంబర్‌ గల లారీ మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ వైపు అతివేగంగా వస్తుండగా.. తర్నం మలుపు వద్ద మరో వాహనాన్ని తప్పించి ఎదురుగా వస్తున్న ఏపీ 28జడ్‌ 4332 నెంబర్‌ గల ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 15 మందికి స్వల్ప గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని స్థానికులు, మండల పోలీసులు నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా చికిత్స నిమిత్తం జిల్లా రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. రూరల్‌ సీఐ కె.మల్లేష్‌, జైనథ్‌ ఎస్సై జగదీశ్‌గౌడ్‌ రిమ్స్‌ ఆసుపత్రికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. కా గా, విషయం తెలుసుకున్న ఆదిలాబాద్‌ ఎ మ్మెల్యే జోగు రామన్న, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, జైనథ్‌ ఎంపీపీ ఎం.గోవర్ధన్‌లు గాయపడిన వారిని రిమ్స్‌ ఆసుపత్రిలో పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Updated Date - 2021-11-09T05:33:27+05:30 IST