లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-05-22T03:48:01+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కలెక్టరేట్‌ నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో కలిసి కలెక్టర్‌, అధికారులతో వైరస్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ కచ్చితంగా అమలు చేయాలన్నారు.

లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి
సీఎం కేసీఆర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 21 : జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కలెక్టరేట్‌ నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో కలిసి కలెక్టర్‌, అధికారులతో వైరస్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ కచ్చితంగా అమలు చేయాలన్నారు. సరైన అను మతి పత్రాలు లేకుండా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కొవిడ్‌ బాధితులకు వైద్య సేవ లు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రులలో సిబ్బందిని నియమించాలని, లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం జరుగుతుందని, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ ప్రక్రియ తప్పదన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బం దులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు చేసి పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. 

కలెక్టర్‌ భారతి హొళికేరి మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయని, ప్రభుత్వాసుపత్రులతోపాటు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా వైద్యసేవలు అందించేందుకు అనుమ తించామన్నారు. కొవిడ్‌ బాధితుల కోసం 950 పడకలు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్‌ కొరత లేదని, నిబంధనల మేరకు పక్క జిల్లాలకు పంపించడం జరుగుతుందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టం చేస్తున్నామని, దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే పాస్‌లు మంజూరు చేస్తున్నామని సీఎంకు వివరించారు. జిల్లాలో ఇంటింటి ఫీవర్‌ సర్వే పూర్తి చేశా మని, 60 శాతం ధాన్యం కొనుగోలు చేశామని, నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, మధుసూదన్‌నాయక్‌, డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఎహెచ్‌వో సుబ్బారాయుడు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ అరవింద్‌,  అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-22T03:48:01+05:30 IST