వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శం
ABN , First Publish Date - 2021-10-21T06:30:46+05:30 IST
ప్రసిద్ధ రామాయణం రాసిన వాల్మీకిమహర్షి జీవి తం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు.

నిర్మల్‌టౌన్, అక్టోబరు 20 : ప్రసిద్ధ రామాయణం రాసిన వాల్మీకిమహర్షి జీవి తం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకిజయంతి సందర్భంగా వెనుకబడిన తరగ తుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రసిద్ధ రామాయణ మహాకావ్యాన్ని రచిం చిన వాల్మీకిమహర్షి కుటుంబపోషణ కోసం దొంగతనాలు, దారిదోపిడీలు చేసే వాడని అన్నారు. నారదమహర్షి హితోపదేశం వల్ల రామాయణ మహాకావ్యాన్ని రాసి మహర్షి అయ్యాడన్నారు. రామాయణ మహాకావ్యాన్ని మొట్టమొదట సంస్కృతిభాషలో రచించి ఆదికవిగా పేరుపొందారని తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మ న్ గండ్రత్‌ఈశ్వర్, సహాయ బీసీ సంక్షేమశాఖ అధికారి సుజయ్, పరిపాలనా ధికారి కాలిక్ అహ్మద్, టీఎన్‌జీవో అధ్యక్షుడు ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, వాల్మీకి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొ న్నారు.