లాక్‌డౌన్‌ అమలులో రాజీ పడకూడదు

ABN , First Publish Date - 2021-05-22T04:13:46+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివా రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌ అమ లులో అధికారులు ఎటువంటి రాజీపడకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు.

లాక్‌డౌన్‌ అమలులో రాజీ పడకూడదు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అధికారులు

- జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ఆసిఫాబాద్‌, మే 21: కరోనా వైరస్‌ వ్యాప్తి నివా రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌ అమ లులో అధికారులు ఎటువంటి రాజీపడకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. వరంగల్‌ నుంచి శుక్ర వారం జిల్లా అధికారులతో లాక్‌డౌన్‌ అమలు, కేసుల నమోదు, వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు వంటి వాటిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మొదట జిల్లాలో లాక్‌డౌన్‌ అమలు చేయాలన్నారు. 10 గంటల లోపు వ్యాపార సముదాయాలు మూసి వేయించాలని 10.10గంటలలోపు రహదారు లపై ఎవరూ తిరగకుండా చూడాలన్నారు. ఇదే సంద ర్భంలో ఆస్పత్రులకు వెళ్లే వారికి అనుమతులు ఇవ్వా లని తెలిపారు. ప్రజలు ఆస్పత్రి, ఇతర పనుల నిమిత్తం వెళ్తే ముంద స్తుగా పోలీసుల అను మతి కోసం ఈ-పాస్‌ విధా నంలో దరఖాస్తు చేసుకునేలా అవ గాహన కల్పించాల న్నారు. ఈనెల30 వరకు ఇదే విధానాన్ని కొనసాగించాలని తెలి పారు. వైరస్‌ నివారణ కోసం వైద్యసిబ్బంది కృషి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలె క్టర్‌ రాజేశం, జిల్లా వైద్యాధికారి కుంరం బాలు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ స్వామి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T04:13:46+05:30 IST