ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2021-08-21T05:38:01+05:30 IST

సీజనల్‌ వ్యాధుల ముప్పు ఉన్నందున ప్రజలందరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ అన్నారు.

ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధుల ముప్పు ఉన్నందున ప్రజలందరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మహాలక్ష్మివాడ, ఫిల్టర్‌బెడ్‌ కాలనీల్లో పర్యటించి దోమల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించారు.పలు వార్డుల్లో కాలీ నడకన పర్యటిస్తూ శానిటేషన్‌ను పరిశీలించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్‌ అధికారులతో కలిసి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల నివారణ పై ప్రజలను చైతన్య పరిచేందుకు వాల్‌పోస్టర్లను అతికించారు. ఇండ్ల చుట్టు పక్కల మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్‌బాల్‌, సెమిఫాక్స్‌ ద్రావణాలను వెదజల్లారు. ఇందులో శానిటర్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌, నాయకులు సంతోష్‌ తదితరులున్నారు.

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

కరోనా పట్ల మరికొన్నాళ్ల పాటు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. శుక్రవారం ఆయననివాసంలో సేవ్‌మూవిలైఫ్‌ ఆధ్వర్యంలో షార్ట్‌ఫిలీమ్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనాపై సందేశాత్మకంగా తీసిన షార్ట్‌ఫిలీంను అందరు ఆదరించాలన్నారు. యూనిట్‌ సభ్యులను అభినందించారు. గత పరిస్థితులను గుర్తు చేస్తూ మరికొన్నాళ్ల పాటు ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షార్ట్‌ ఫిలీం డైరెక్టర్‌ రాహుల్‌, బండారి సతీష్‌, అశోక్‌స్వామి, అజయ్‌, రాము తదితరులున్నారు. 

Updated Date - 2021-08-21T05:38:01+05:30 IST