ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

ABN , First Publish Date - 2021-02-02T04:59:03+05:30 IST

ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తామ ని ప్రగల్భాలు పలికి ప్రస్తుతం సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠ శాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌ అంటగట్టి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రమణరావు అన్నారు.

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
మాటేగాంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రమణరావు

భైంసా రూరల్‌, ఫిబ్రవరి 1: ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తామ ని ప్రగల్భాలు పలికి ప్రస్తుతం సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠ శాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌ అంటగట్టి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రమణరావు అన్నారు. సోమవారం మండలంలోని మాటే గాం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరస న వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యా యులకు పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయకుండా వారిని సర్దు బాటు పేరుతో ఉన్నత పాఠశాలల్లో డిప్యూటేషన్‌పై పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు, తదితరులున్నారు. 

నర్సాపూర్‌(జి): ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగా మండల కేంద్రం లోని జడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. 

సారంగాపూర్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌టీయూ పిలుపు మేరకు సోమ వా  రం మండలంలోని ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు భోజన వి రామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.  

దస్తూరాబాద్‌: భాషా పండితులను వెంటనే ఉన్నతీకరించాలని, త్రిసభ్య కమిటీకి వ్యతిరేకంగా మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇందులో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు ఎల్‌. భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.బుచ్చన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T04:59:03+05:30 IST