ఆదివాసీ చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-30T05:39:43+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ హక్కులను కాలరాస్తుందని ఎంపీ సోయం బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గవర్నర్‌ తమిళిసైని కలిసి జీవో 317 రద్దు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం చట్టబద్ధంగా ఆదివాసీలకు కల్పించిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. ఏజెన్సీలో భూబదలాయింపు

ఆదివాసీ చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వం
గవర్నర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న ఎంపీ బాపురావు

జీవో నెం.317 రద్దు చేయాలి

గవర్నర్‌ను కలిసిన ఎంపీ 

ఆదిలాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ హక్కులను కాలరాస్తుందని ఎంపీ సోయం బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గవర్నర్‌ తమిళిసైని కలిసి జీవో 317 రద్దు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం చట్టబద్ధంగా ఆదివాసీలకు కల్పించిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. ఏజెన్సీలో భూబదలాయింపు చట్టం పకడ్బందీగా అమలు పర్చకుండా ఆదివాసీ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఐటీడీఏ పీఓలు సక్రమంగా పని చేయక పోవడంతో ఆదివాసీల జీవన విధానం అస్థవ్యస్థంగా మారుతుందన్నారు. పోడు భూములకు పట్టా హక్కులు ఇచ్చి, ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీ గ్రామాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఆదివాసీలపై పోలీసు లు, రెవెన్యూ, ఫారెస్టు అధికారుల వేదింపులు పెరిగి పోతున్నాయని ఆరోపించారు. ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీల్లో పారదర్శకత లోపించిందని వెంట నే 317 జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయన వెంట పలువురు ఆదివాసీ సంఘాల నేతలు, తదితరులున్నారు.

Updated Date - 2021-12-30T05:39:43+05:30 IST