రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2021-12-20T03:35:35+05:30 IST

రహదారుల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాల యంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు డీఎంఎఫ్‌టీ నిధులు రూ.1.50 కోట్లతో గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్ధశ పట్టనుందని, దీంతో ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొ న్నారు.

రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ఎమ్మెల్యే చిన్నయ్యను సన్మానిస్తున్న ప్రజాప్రతినిధులు

 బెల్లంపల్లి, డిసెంబరు 19: రహదారుల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాల యంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు  గ్రామాలకు డీఎంఎఫ్‌టీ నిధులు రూ.1.50 కోట్లతో గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్ధశ పట్టనుందని, దీంతో ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొ న్నారు. భీమిని మండలంలోని మామిడిపల్లి నుంచి రాజారం, బెల్లంపల్లి మండలం పెర్కపల్లి నుంచి దుగ్నే పల్లి, తాండూర్‌ మండలంలోని అంకుశం, కిష్టంపేట, కొత్తపల్లి, ద్వారకా గ్రామాలకు నిధులు మంజూరయ్యా యని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో త్వరగా రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామ న్నారు. అనంతరం  నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఆయా గ్రామాల సర్పం చులు, ఎంపీటీసీ, ఎంపీపీలు సన్మానించారు. సర్పంచు  సురేష్‌, ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ సుభాష్‌రావు, నాయకులు భీమాగౌడ్‌, నిరంజన్‌ గుప్తా, సర్పంచులు వెంకటేష్‌, శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 

నడకతో ఆరోగ్యం 

నడకతో ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. ఆదివారం బెల్లంపల్లి స్పోర్ట్స్‌ క్లబ్‌, ఎయిర్‌టెల్‌ సంయుక్తంగా నిర్వహించిన 5కే రన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రన్‌లో పరిగెత్తి హుషారు నింపారు.  ఎమ్మెల్యే మాట్లా డుతూ యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని, క్రీడ ల్లో చురుకైన పాత్ర పోషించాలని పేర్కొన్నారు. నియో జకవర్గం నుంచి క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటాలని కోరారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆరోగ్యం కోసం రోజు వాకింగ్‌, వ్యాయామం, యోగా చేయాలని పేర్కొ న్నారు. పరుగు పందెంలో విజేతలకు బహుమతులను అందించారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, నాయకులు భీమాగౌడ్‌, సిద్దంశెట్టి సాజన్‌, రేవెల్లి విజయ్‌, పుల్లూరి మోహన్‌, వంశీ, రాకేష్‌ పాల్గొన్నారు. 

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ 

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. తాళ్ల గురిజాల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు మంజూరైన రూ.లక్ష, తారకు మంజూరైన రూ. 60 వేలు, హరీష్‌కు మంజూరైన రూ.20 వేల చెక్కులను పంపిణీ చేశారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం పేదలకు వరంలాంటిదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమవారం కాంటా చౌరస్తా వద్ద మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టే కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. 

Updated Date - 2021-12-20T03:35:35+05:30 IST