క్రీడాకారులను ఇండియన్‌ క్రికెట్‌టీంలో ఆడించటమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-08-03T06:17:09+05:30 IST

నిర్మల్‌ జిల్లా నుండి ఇండియన్‌ క్రికెట్‌ టీంలో ఆడించటమే మా లక్ష్యం అని తెలంగాణ క్రికెట్‌ అసోసి యేషన్‌ జిల్లా అధ్యక్షుడు వివేకానందరెడ్డి అన్నారు.

క్రీడాకారులను ఇండియన్‌ క్రికెట్‌టీంలో ఆడించటమే లక్ష్యం

నిర్మల్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లా నుండి ఇండియన్‌ క్రికెట్‌ టీంలో ఆడించటమే మా లక్ష్యం అని తెలంగాణ క్రికెట్‌ అసోసి యేషన్‌ జిల్లా అధ్యక్షుడు వివేకానందరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక డ్యాంగాపూర్‌లోని మహేశ్వర పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి క్రికెట్‌ జట్ల ఎంపిక పోటీలకు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిభ కలిగినటువంటి గ్రామీణ క్రీడా కారులను వెలికి తీసి ఐపీఎల్‌లో, ఇండియన్‌ టీంలో ఆడించటమే లక్ష్యంగా ‘రూల్‌ క్రికెట్‌ ఆన్‌ గ్లోబల్‌ వికెట్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ముందు కు వెళ్తున్నామన్నారు. టాలెంట్‌ ఎవరికీ సొంత కాదని కష్ట పడిన ప్రతీవ్యక్తి క్రికెట్‌ రాణించగలరని క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాజట్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కోఆర్డినేటర్‌ మాజిద్‌ ఖాన్‌, కోచ్‌ రాంరాజ్‌, భైంసా, ముధోల్‌, ఖానాపూర్‌, నిర్మల్‌ డివిజన్‌లోని మండలాలకు చెంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్‌-19 క్రికెట్‌ జట్టులో.... రాజ్‌కుమార్‌, పైజాం, సూరజ్‌, వంశీ, విష్ణు సాయితేజ, ఆకాష్‌, సూర్య, రవి, సిద్దు, గోవర్ధన్‌, స్థాయికిరణ్‌, పవన్‌కల్యాణ్‌, విష్ణు, మనోజ్‌, అవినాష్‌ అలా గే అండర్‌- 23 క్రికెట్‌ జట్టులో.... సూర్య, శ్రీధర్‌, సాయిరాజ్‌, శివ, చంద్రప్రభ, కిరణ్‌, షాభాష్‌, వినయ్‌, కళ్యాణ్‌, గంగరాజు, బి. వంశీ, సంజుసింగ్‌, రాము, సచిన్‌, తదితరులు ఎంపికయ్యారు. 

Updated Date - 2021-08-03T06:17:09+05:30 IST