మొక్కలను సంరక్షిస్తేనే లక్ష్యం నెరవేరుతుంది
ABN , First Publish Date - 2021-07-08T06:30:56+05:30 IST
మొక్కలను సంరక్షిస్తేనే మన లక్ష్యం నెరవేరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి, పల్లె ప్రగతి తెలంగాణకు హరితహరం ప్రత్యేక అధికారి అంజి ప్రసాద్ అన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్
లక్ష్మణచాంద, జూలై 7 : మొక్కలను సంరక్షిస్తేనే మన లక్ష్యం నెరవేరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి, పల్లె ప్రగతి తెలంగాణకు హరితహరం ప్రత్యేక అధికారి అంజి ప్రసాద్ అన్నారు. హరితహరం కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిరుపెల్లి, పొట్టపెల్లి గ్రామాల్లో బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి స్థానిక ప్రజలకు పలు సలహలు, సూచనలు చేశారు. మొక్కలను సంరక్షిస్తేనే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. తద్వారా వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందని, దీని ద్వారా పర్యావరణం ఆహ్దకరంగా ఉండటంతో పాటు సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేశం లక్ష్మి రమేష్, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, ఎంపీఈవో నసిరుద్దీన్, ఏపీవో దివ్య, స్థానిక సర్పంచ్‌లు కొరిపెల్లి కృష్ణారెడ్డి, హైమావతి రాజు, ఎంపీటీసీలు బూసి రమా ముత్యం, పడిగెల అనిత సురేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గంగారాం, ఐకేపీ సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.