యువత చవుదుపై దృష్టిసారించాలి
ABN , First Publish Date - 2022-01-01T04:07:03+05:30 IST
యువత చెడు వ్యసనాలకు దురంగా ఉండి చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వెల్ది గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభిం చారు.

- ఎస్పీ సురేష్‌కుమార్
వాంకిడి, డిసెంబరు 31: యువత చెడు వ్యసనాలకు దురంగా ఉండి చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వెల్ది గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సహకారం ఎప్పటికీ ఉంటుందని ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలు సంఘవిద్రోహక శక్తులకు దూరంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేయడంపై డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సుధాకర్, ఎస్సై డీకొండ రమేష్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య పరీపక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 500దుప్పట్లు, బియ్యం బ్యాగులు, పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అజయ్ కుమార్, సర్పంచులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.