యువకుడి అదృశ్యం

ABN , First Publish Date - 2021-08-28T05:11:43+05:30 IST

పనికోసం వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన దోమకొండ గ్రామంలో చోటు చేసుకుంది.

యువకుడి అదృశ్యం

దోమకొండ, ఆగస్టు 27: పనికోసం వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన దోమకొండ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లపు స్వామి (19) మూడు నెలల క్రితం పనికోసం ఆర్మూర్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు యువకుడి కోసం బంధువులు వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి పోశయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్‌ శుక్రవారం తెలిపారు.

Updated Date - 2021-08-28T05:11:43+05:30 IST