సిమెంట్‌ దిమ్మె పడి బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-10-21T04:56:00+05:30 IST

జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌ కాలనీవద్ద నిర్మిస్తున్న ఫోర్‌లైన్‌ పనుల్లో బుధ వారం అపశృతి చోటుచేసు కుంది. వంతెననిర్మాణం కోసం అమర్చిన సిమెంటు దిమ్మెపడి భాగ్యనగర్‌కాలనీకి చెందిన ఈశ్వర్‌(7)అనే బాలుడు అక్క డికక్కడే మృతిచెందగా త్రిశూల్‌ అనే మరో బాలుడికి గాయాలయ్యాయి.

సిమెంట్‌ దిమ్మె పడి బాలుడి మృతి
బాలుడు ఈశ్వర్‌ మృతదేహంతో రోధిస్తున్న కుటుంబ సభ్యులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు20: జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌ కాలనీవద్ద నిర్మిస్తున్న ఫోర్‌లైన్‌ పనుల్లో బుధ వారం అపశృతి చోటుచేసు కుంది. వంతెననిర్మాణం కోసం అమర్చిన సిమెంటు దిమ్మెపడి భాగ్యనగర్‌కాలనీకి చెందిన ఈశ్వర్‌(7)అనే బాలుడు అక్క డికక్కడే మృతిచెందగా త్రిశూల్‌ అనే మరో బాలుడికి గాయాలయ్యాయి. రోడ్డునిర్మాణ పనులు చేపడుతున్న నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రమాదానికి కారణమని ఆరో పిస్తూ ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకుదిగారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండుగంటల పాటు రాస్తా రోకో నిర్వహించడంతో ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపో యాయి. కుమరంభీం వర్ధంతి కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగివస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి సంఘటనస్థలాన్ని పరిశీ లించారు. బాధితకుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి.

Updated Date - 2021-10-21T04:56:00+05:30 IST