దరఖాస్తుల గడువు పొడిగించాలి

ABN , First Publish Date - 2021-11-24T04:14:05+05:30 IST

పోడు భూముల దరఖాస్తుల స్వీక రణ గడువును ప్రభుత్వం పొడిగించాలని ఆదివాసీ సంఘాల నాయ కులు డిమాండ్‌ చేశారు

దరఖాస్తుల గడువు పొడిగించాలి
మాట్లాడుతున్న ఆదివాసీ సంఘాల నాయకులు.

సిర్పూర్‌(యూ), నవంబరు 23: పోడు భూముల దరఖాస్తుల స్వీక రణ గడువును ప్రభుత్వం పొడిగించాలని ఆదివాసీ సంఘాల నాయ కులు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం  ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుడ్మేత విశ్వనాథ్‌ రావు, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు పెందొర్‌ మాధవ్‌రావు మాట్లా డారు. ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది ఆదివాసీలు వివిధ కారణాల తో పోడు భూముల విషయంపై దరఖాస్తులు చేయలేకపోయా రన్నారు. ప్రభుత్వం గతంలో డిసెంబరు 8వ తేదీ వరకు గడువు ప్రకటించిం దన్నారు. అయితే ఈ నెల 22 వ తేదీ వరకే దరఖాస్తులు స్వీకరణ ముగించడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారని చెప్పారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచించి దరఖాస్తు గడువు పొడి గించాలని కోరారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి దుర్వా శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఆత్రం కభీర్‌దాస్‌, ఆత్రం జ్యోతిరాం, సెడ్మకి గుణవంతరావు, దుర్వా లచ్చు, సెడ్మకి బాపురావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T04:14:05+05:30 IST