ఏజెన్సీ ఎస్సీ రైతుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-03-22T05:37:59+05:30 IST

ఏజెన్సీలో ఏళ్ల తరబడి నివసిస్తూ సాగు చేసుకుంటున్న దళిత రైతుల సమస్యలు వెంటనే పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ ఏజెన్సీ షెడ్యుల్డ్‌ కులాల రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

ఏజెన్సీ ఎస్సీ రైతుల సమస్యలు పరిష్కరించాలి
జడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దళిత రైతులు

ఆదిలాబాద్‌ అర్బన్‌, మార్చి 21: ఏజెన్సీలో ఏళ్ల తరబడి నివసిస్తూ సాగు చేసుకుంటున్న దళిత రైతుల సమస్యలు వెంటనే పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ ఏజెన్సీ షెడ్యుల్డ్‌ కులాల రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేస్తున్న దళిత రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలని రైతుబంధు పథకం వర్తింప చేయాలని, డిజిటల్‌ సర్వేలో భాగంగా ఏజెన్సీలో దళిత భూములకు కూడా సర్వే నిర్వహించాలని ఏజెన్సీలో భూముల కు హక్కులు కల్పించాలని, భూమిలేని దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందులో ఏజెన్సీ షెడ్యూల్డు కులాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు మోతేరావు అనిల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమేరనాగోరావ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:37:59+05:30 IST