కేంద్ర ప్రభుత్వం వల్లనే ‘దళితబంధు’ నిలిపివేత

ABN , First Publish Date - 2021-10-20T03:54:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం వల్లనే దళితబంధు పథకం నిలిచిపోయిందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం కాంటాచౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ దళితబంధును నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం దళితులకు ద్రోహం చేసిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం వల్లనే ‘దళితబంధు’ నిలిపివేత
బెల్లంపల్లిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే, నాయకులు

బెల్లంపల్లి, అక్టోబరు 19: కేంద్ర ప్రభుత్వం వల్లనే దళితబంధు పథకం నిలిచిపోయిందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం కాంటాచౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ దళితబంధును నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం దళితులకు ద్రోహం చేసిందన్నారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. బీజేపీ చేసిన ద్రోహానికి దళితులు ఓట్లతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌చైర్మన్‌ సుదర్శన్‌, నాయకులు నర్సింగం, నారాయణ, సత్యనారాయణ పాల్గొన్నారు. 

ఫ తాండూర్‌: కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి, బీజేపీ కుట్ర ల వల్లనే దళితబంధు పథకాన్ని నిలిపివేయాల్సి వ చ్చిందని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. తాం డూర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశా రు. దళితుల సాధికారిత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఎంపీపీ ప్రణయ్‌కుమార్‌, పార్టీ మండ లాధ్యక్షుడు దత్తుమూర్తి, వైస్‌ఎంపీపీ నారాయణ,  శంకరమ్మ, సతీష్‌, పాపయ్య పాల్గొన్నారు. 

భీమిని : దళితబంధు పథకాన్ని ఆపినందుకు నిరసనగా మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నిరంజన్‌ గుప్తా ఆధ్వర్యంలో ప్రధాన మం త్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. సుదర్శన్‌గౌడ్‌, ఆరీఫ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 కన్నెపల్లి: దళితబంధు పథకాన్ని కేంద్ర ప్రభు త్వం నిలిపివేసినందుకు నిరసనగా మండల కేంద్రం లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ నాయకు లు దహనం చేశారు. జడ్పీటీసీ సత్యనారాయణ, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌, సర్పంచు సురేఖరాజయ్య, ఎంపీటీసీ భారతిసంతోష్‌లు మాట్లాడుతూ దళితుల ఆర్థిక స్థితిగతులు మార్చడా నికి సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం నిలిపి వేయడం అన్యాయమన్నారు.  రంగరావు, శ్రీరామరావు, ప్రశాంత్‌,  పాల్గొన్నారు. 

  కాసిపేట: దళితబంధు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎంపీటీసీ లక్ష్మీ మాట్లాడు తూ ఎన్నికల కోడ్‌ పేరుతో దళితబంధును పంపిణీ చేయకుండా కేంద్రం అడ్డుకోవడం దళితులకు ద్రోహం చేసినట్లేనన్నారు. అగ్గి సత్తయ్య,  ప్రశాంత్‌, రత్నం రాజన్న, బుగ్గరాజు, మేడ రాంచందర్‌, రాంచందర్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-20T03:54:41+05:30 IST