డెంగ్యూతో పదో తరగతి విద్యార్థిని మృతి

ABN , First Publish Date - 2021-11-09T05:34:15+05:30 IST

డెంగ్యూ జ్వరంతో మండలంలో ఓ విద్యార్థిని సోమవారం మృతి చెందినది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన అన్‌రెడ్డి రుచితరెడ్డి (15) రెండు రోజులుగా జ్వరం రావడంతో నిర్మల్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

డెంగ్యూతో పదో తరగతి విద్యార్థిని మృతి

ఇచ్చోడ రూరల్‌, నవంబరు 8: డెంగ్యూ జ్వరంతో మండలంలో ఓ విద్యార్థిని సోమవారం మృతి చెందినది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన అన్‌రెడ్డి రుచితరెడ్డి (15) రెండు రోజులుగా జ్వరం రావడంతో నిర్మల్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.  సోమవారం పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఇచ్చోడ మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ అన్‌రెడ్డి శ్రీకాంత్‌రెడ్డి (నారాయణరెడ్డి) కూతురు రుచితరెడ్డి బోరిగామ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. రుచితరెడ్డి డెంగ్యూ జ్వరంతో మృతి చెందడంతో బోరిగామ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. రుచిత కుటుంబాన్ని గ్రామ సర్పంచ్‌ అరుంధతి, తదితరులు పరామర్శించారు. 

Updated Date - 2021-11-09T05:34:15+05:30 IST