జీవో 317ను రద్దు చేయాలని ఉపాధ్యాయుల ర్యాలీ
ABN , First Publish Date - 2021-12-31T04:16:24+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను రద్దు చేసి స్ధానికతను పరిగణలోకి తీసు కోవాలని టీపీయూఎస్ ఆధ్వర్యంలో డీఈవో కార్యాల యం నుంచి కలెక్టరేట్ వరకు గురువారం ఉపాధ్యా యులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఏఈవోకు, డీఈవోకు వినతి పత్రాలు అందించారు.

ఏసీసీ, డిసెంబరు 30: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను రద్దు చేసి స్ధానికతను పరిగణలోకి తీసు కోవాలని టీపీయూఎస్ ఆధ్వర్యంలో డీఈవో కార్యాల యం నుంచి కలెక్టరేట్ వరకు గురువారం ఉపాధ్యా యులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఏఈవోకు, డీఈవోకు వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వం హడావుడిగా జారీ చేసిన జీవో వల్ల ఎంతో మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు సీనియారిటీ పేరుతో వేరే జిల్లాలకు స్ధానికేతరులుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిం దని ఆవేదన వ్యక్తంచేశారు. ఎలాంటి శాస్ర్తీయత లేకుండా నిరంకుశంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసి స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా హడావుడిగా కౌన్సెలింగ్ చేపట్టిందని విమర్శించారు. సీనియారిటీ జాబితాలోని తప్పులపై నిర్ణయం తీసుకోకముందే కౌన్సెలింగ్ చేపట్టి ఆప్షన్‌ల ద్వారా ఉపాధ్యాయులను జిల్లాల వారీగా కేటాయించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బగ్గని రవికుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, బండి రమేష్, సమ్మయ్య, ఓంప్రకాష్, రాజనర్సు, పురుషోత్తం, స్వాతి, వసంత తదితరులు పాల్గొన్నారు.