సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

ABN , First Publish Date - 2021-02-06T04:20:02+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 9న కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపడుతున్నామని టీఎస్‌పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాస్‌రావు అన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
సమావేశంలో మాట్లాడుతున్న టీఎస్‌పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రావు


టీఎస్‌పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాస్‌రావు
 కాగజ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 5: ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 9న కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపడుతున్నామని టీఎస్‌పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాస్‌రావు అన్నారు.  శుక్రవారం డీఆర్సీ భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారన్నారు. అలాగే మూడేళ్లుగా బదిలీలు జరగక తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.  45 శాతం ఫిట్‌మెంట్‌ కోసం ఎదురు చూసిన ఉపాధ్యాయులకు 33 నెలలుగా అమలు జరగకపోవడంతో తీవ్ర  ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు స్కేల్‌ వర్తింపు, ప్రసూతి సెలవులు, మోడల్‌ స్కూళ్లలో బదిలీలు, పదోన్నతులు, ఐటీడీఎ కాంట్రాక్టు టీచర్ల రెగ్యులరైజేషన్‌ తదితర సమస్యలను  ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు.  కార్యక్రమానికి ప్రభుత్వ, పీఆర్‌ ఉపాధ్యాయులు, కేజీబీవీ, రెసిడెన్షియల్‌, ఐటీడీఎ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కెరమెరి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని  మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట టీఎస్‌పీఆర్టీయూ ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కోరారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన వెంట ఉపాధ్యాయ సంఘాల నాయకులు భరత్‌, విజయ్‌, ప్రవీణ్‌, సంతోష్‌, ప్రదీప్‌, మహార్షి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-02-06T04:20:02+05:30 IST