కత్తర్లలో విద్యాశాఖ అధికారుల సర్వే

ABN , First Publish Date - 2021-11-03T03:57:17+05:30 IST

కత్తర్లలో పాఠశాల ఏర్పాటుపై విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఆరేళ్ల కిందట ప్రాథమిక పాఠశాల మూసివేయగా ఈయేడు సుమారు 25 మంది పిల్లలు చదువులకు దూరమయ్యారు. విషయాన్ని సర్పంచ్‌ శారద, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతోపాటు డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు.

కత్తర్లలో విద్యాశాఖ అధికారుల సర్వే
స్థానికులతో మాట్లాడుతున్న ఎంఈవో ప్రభాకర్‌

తాండూర్‌, నవంబర్‌ 2: కత్తర్లలో పాఠశాల ఏర్పాటుపై విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఆరేళ్ల కిందట ప్రాథమిక పాఠశాల మూసివేయగా ఈయేడు సుమారు 25  మంది   పిల్లలు చదువులకు దూరమయ్యారు. విషయాన్ని సర్పంచ్‌ శారద, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి   ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతోపాటు డీఈవో  దృష్టికి తీసుకువెళ్లారు. స్థానికంగా డిగ్రీ పూర్తి చేసిన యువతిని నగదు జమచేసి వలంటీర్‌గా నియమించారు. దీంతో డీఈవో  ఆదేశాలతో ఎంఈవో ప్రభాకర్‌ మంగళవారం గ్రామానికి వచ్చారు. గ్రామంలో 22 మంది పిల్లలున్నట్టుగా గుర్తించారు. ఇక్కడి పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని పేర్కొన్నారు. అభినవ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌, బోయపల్లి ఉప సర్పంచి వెంకటేష్‌, బోయపల్లి పాఠశాల ఉపాధ్యాయులు కూడా  ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

Updated Date - 2021-11-03T03:57:17+05:30 IST