మూఢనమ్మకాలను విడనాడాలి
ABN , First Publish Date - 2021-03-25T05:25:05+05:30 IST
మూఢనమ్మకాలను విడ నాడాలని కాగజ్‌నగర్ ఏఎస్పీ బాలస్వామి అ న్నారు.

- ఏఎస్పీ బాలస్వామి
కౌటాల, మార్చి 24: మూఢనమ్మకాలను విడ నాడాలని కాగజ్‌నగర్ ఏఎస్పీ బాలస్వామి అ న్నారు. మండలంలోని తాటిపల్లి గ్రామంలో ఫిబ్ర వరి 10న జరిగిన హత్య కేసులో నిందితులను అ రెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాల యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాటిపల్లి గ్రామానికి చెందిన డోంగ్రి భీంరావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పర్గాడే సునీల్, తుమ్మిడి సందీప్‌ల కుటుంబ స భ్యులకు మంత్రాలు చేస్తున్నాడనే అనుమానిం చారు. పర్గాడే సునీల్, తుమ్మిడే సందీప్, బోయ శైలేష్, పర్గాడే భగీరథ్, తుమ్మిడే గణపతిలు ఫిబ్ర వరి 10న భీంరావును పెన్‌గంగా నదికి తీసుకెళ్లి నీటిలో ముంచి చంపినట్లు పేర్కొన్నారు. మార్చి 14న గంగలో డోంగ్రి భీంరావు మృతదేహాన్ని గు ర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను గు ర్తించి బుధవారం రిమాండ్‌కు పంపినట్లు పేర్కొ న్నారు. సమావేశంలో కౌటాల సీఐ శ్రీనివాస్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.