గోదావరి నదిలో దూకి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-01T05:39:39+05:30 IST

గోదావరి నదిలోకి దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రేమ్‌దీప్‌ ఆదివారం తెలిపారు. పోలీసు వివరా ల ప్రకారం.. కుభీర్‌ మండల కేంద్రానికి చెందిన ఠాకూర్‌ మనోజ్‌ గత కొంత కాలంగా మద్యానికి బానిసై మతిస్థిమితం సరిగా లేక ఉన్నాడని, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఎస్సై తెలిపారు.

గోదావరి నదిలో దూకి ఆత్మహత్య

బాసర, జనవరి 31: గోదావరి నదిలోకి దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రేమ్‌దీప్‌ ఆదివారం తెలిపారు. పోలీసు వివరా ల ప్రకారం.. కుభీర్‌ మండల కేంద్రానికి చెందిన ఠాకూర్‌ మనోజ్‌ గత కొంత కాలంగా మద్యానికి బానిసై మతిస్థిమితం సరిగా లేక ఉన్నాడని, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులు గాలించగా ఆదివారం ఉదయం గోదావరి నదిలో శవం లభ్యమైనట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియాసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-02-01T05:39:39+05:30 IST