ఈటలకు మద్దతుగా యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-05-03T04:26:04+05:30 IST

ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుం చి తప్పించడంపై మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన ఆదివారం సాయంత్రం మందమర్రి పట్టణంలో చోటు చే సుకుంది.

ఈటలకు మద్దతుగా యువకుడి ఆత్మహత్యాయత్నం
వ్యాన్‌ కింద పడి నినాదాలు చేస్తున్న వెంకటేష్‌

మంచిర్యాల, మే 2 (ఆంధ్రజ్యోతి): ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుం చి తప్పించడంపై మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన ఆదివారం సాయంత్రం మందమర్రి పట్టణంలో చోటు చే సుకుంది. ఈటల రాజేందర్‌ సొంతూరు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌కు చెందిన బండి వెంకటేశ్‌ ముదిరాజ్‌ తండ్రి కొమురయ్య సింగరేణి ఉద్యోగి కా వ డంతో కుటుంబ సభ్యులతో కలిసి మందమర్రిలో నివాసం ఉంటున్నాడు. వెం కటేశ్‌ హైద్రాబాద్‌లోని జేబీఎస్‌ వద్ద హోటల్‌ నడుపుకుంటూ భార్య, ఇద్దరు పి ల్లలతో జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వెంకటేశ్‌ మందమర్రికి వ చ్చాడు. ఈటలకు వీరాభిమాని అయిన వెంకటేశ్‌ ఆయనను మంత్రి పదవి నుం చి తప్పించడం పట్ల తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సాయంత్రం ఆరు గం టల సమయంలో మందమర్రి పాత బస్టాండ్‌ సమీపంలోని అంగడి బజార్‌ వ ద్ద కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకొనేందుకు యత్నించాడు. గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. దీంతో జై ఈటల అంటూ నినాదాలు చేస్తూ మెయిన్‌ రోడ్డు వైపు వెళ్లి వ్యాన్‌ కింద పడ్డాడు. గమనించిన డ్రైవర్‌ వాహనాన్ని నిలిపి వే యడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సం ఘటన స్థలానికి చేరుకొని యువకున్ని అదుపులోనికి తీసుకున్నారు. వెంకటేశ్‌ ఐ దేళ్లుగా ఈటల యువసేన పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. 

Updated Date - 2021-05-03T04:26:04+05:30 IST