రేపు సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్
ABN , First Publish Date - 2021-10-22T05:05:41+05:30 IST
ఆదిలాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ బాల బాలకల సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌టౌన్, అక్టోబరు 21: ఆదిలాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ బాల బాలకల సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్ పేర్కొన్నారు. పోటీల్లో భాగంగా 10 సంవత్సరాల బాల బాలికలకు 100, 300ల మీటర్ల లాంగు జంపు నిర్వహించడం జరుగుతుందని ఇందులో పాల్గొనే వారు 2011 అక్టోబర్ 31 నుంచి 2013 నవంబర్ 1 లోపు జన్మించి ఉండాలన్నారు. 12 సంవత్సరాల వారు 100 మీటర్లు, 600ల మీటర్లు, షాట్‌పుట్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని ఇందులో పాల్గొనే వారు 2009 అక్టోబరు 31 నుంచి 2011 నవంబర్ 1 లోపు జన్మించి ఉండాలన్నారు. అదే విధంగా 14 సంవత్సరాల వారికి 400ల మీటర్లు పరుగు మాత్రమే ఉంటుందని ఇందులో పాల్గొనే వారు 31-10-2007 నుంచి 01- నవంబర్ 2009 మధ్యలో జన్మించి ఉండాలని తెలిపారు. ఇందులో పాల్గొనే బాల బాలికలు తప్పని సరిగా వయస్సు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలని కోరారు.