సమాజాభివృద్ధికి విద్యార్థులు తోడ్పడాలి
ABN , First Publish Date - 2021-11-21T06:07:26+05:30 IST
ఆదివాసీ విద్యార్థులు చదువులో రాణించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఎస్పీ రాజేష్‌చంద్ర అన్నారు. ఆరోగ్యపరంగా స్థిరం గా ఉన్న విద్యార్థులు చదువులో మరింత రాణించే అవకాశం ఉంటుందని అన్నా రు. తల్లిదండ్రులకు కొంత కష్టమైన తమ పిల్లలను చదువుపై ప్రోత్సహించాలని కోరారు.

మెగా వైద్య శిబిరంలో ఎస్పీ రాజేష్ చంద్ర
ఆదిలాబాద్ టౌన్, నవంబరు 20: ఆదివాసీ విద్యార్థులు చదువులో రాణించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఎస్పీ రాజేష్‌చంద్ర అన్నారు. ఆరోగ్యపరంగా స్థిరం గా ఉన్న విద్యార్థులు చదువులో మరింత రాణించే అవకాశం ఉంటుందని అన్నా రు. తల్లిదండ్రులకు కొంత కష్టమైన తమ పిల్లలను చదువుపై ప్రోత్సహించాలని కోరారు. శనివారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం మామిడిగూడ గ్రామంలో భారీ మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ వైద్య శిబిరాన్ని పరిశీలించి 12 గ్రామాలలోని 600మంది మహిళలు, ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు, చికిత్స పొందేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తాను తనదైన శైలీలో ప్రజలకు మరింత చేరువవుతున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామ ప్రజలకు అందుబాటులోఉండాలనే లక్ష్యంతో ప్రజల వద్దకే వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గ్రామీణ మండలంలోని మారుమూల మామిడి గ్రామంలో పది మంది డాక్టర్ల బృందంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటుచేసి 600 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, చికిత్స అందేలా చూశామన్నారు. ముఖ్యంగా రక్తహీనత కలిగిన మహిళలకు బలవర్ధకమైన టానిక్‌లను ఎస్పీ చేత అందజేశారు.
గ్రామీణ యువతకు క్రీడల్లో ప్రోత్సాహం
గ్రామాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలోని యువతను క్రీడల పరంగా ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. మామిడిగూడ పరిధిలోని ఆదిలాబాద్ గ్రామీణ మండలం, లింగుగూడ, జాముల్‌ధరి, పిప్పల్‌ధరి, లోకారి, దార్‌లొద్ది, దహిగూడ,మామిడికోరి, ఖండాల, ఖానాపూర్‌లకు పలువరు క్రీడాకారులకు క్రీడా పరికరా లు వాలీబాల్, బ్యాడ్‌మెంటన్, క్రికెట్ కిట్లు అందజేసి ప్రోత్సహించారు. అయితే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి కనబర్చి తమ మేధాశక్తితో సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఇందులో గ్రామీణసీఐ పురుషోత్తమచారి, ఎస్సై హరిబాబును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదవ్‌రావ్, గ్రామ పటేల్ మర్సకోల తులసిరాం, ఎంపీటీసీ మాడ సురక్క, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.