కఠినంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు

ABN , First Publish Date - 2021-05-21T04:20:57+05:30 IST

ప్రభుత్వం ఈనెల 30వరకు లాక్‌ డౌన్‌ను పొడిగించడంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు.

కఠినంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు
ఆసిఫాబాద్‌లో వాహనాల తనిఖీ చేస్తున్న డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, మే 20: ప్రభుత్వం ఈనెల 30వరకు లాక్‌ డౌన్‌ను పొడిగించడంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు గురువారం జిల్లా కేంద్రంలో వాహ నాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు మాట్లాడుతూ అనుమతించిన సమయాల్లోనే ప్రజలు నిత్యావసర సరకులు కొను గోలు చేయాలన్నారు. ఉదయం 10నుంచి అత్యవసర సేవలు మినహా దేనికి అనుమతి లేదన్నారు. అనుమతి లేకుండా బయట తిరిగితే వాహనాలను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలిస్తామన్నారు. వ్యాపారులు ఉదయం 9.45కే వ్యాపార కార్యకలాపాలను మూసి వేసి 10గంటలలోగా ఇంటికి చేరుకోవాలన్నారు. ఆంక్ష లను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సంద ర్భంగా సీఐ అశోక్‌ ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేష్‌ పోలీసు బలగాలతో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమతి లేకుండా బయట తిరిగే వాహనాలను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

బెజ్జూరు: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య లు తప్పవని ఎస్సై సాగర్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ముమ్మ రంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనవస రంగా రోడ్లమీదికి వచ్చిన వారి వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ట్రైనీ ఎస్సై సందీప్‌, ఎస్సై ఆశన్న, పోలీసులు ఉన్నారు.

సిర్పూర్‌(టి): మండలంలో లాక్‌డౌన్‌ను కఠి నంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10నుంచి రోడ్లపై ఎవరూ తిరగకుండా విస్తృతంగా ఎస్సై రవికుమార్‌ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 10 గంటల తరువాత రోడ్లపైకి వచ్చిన 15వాహనాలను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలన్నారు. ఏఎస్సై రాములు, సిబ్బంది ఉన్నారు.

సిర్పూర్‌(యూ): మండలం లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా చేప డుతున్నారు. గురువారం పోలీ సులు ఆటోలో లౌడ్‌స్పీకర్‌ ఏర్పా టు చేసి ప్రచారం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఎస్సై విష్ణువర్ధన్‌ మాట్లా డుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరిం చడంతోపాటు భౌతికదూరం పాటించాలన్నారు. అన వసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు.

రెబ్బెన: ఉదయం 10గంటల తరువాత నిబంధ నలను ఉల్లంఘించి బయట తిరిగితే చర్యలు తప్ప వని రెబ్బెన సీఐ సతీష్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఒక్క సారిగా నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారని దీంతో మార్కెట్లు, దుకాణాల వద్ద రద్దీ ఏర్పడు తోందన్నారు. అనవసరంగా రోడ్ల మీదికి వస్తే వాహ నాలను సీజ్‌చేసి కేసులునమోదు చేస్తామన్నారు.

కౌటాల: లాక్‌డౌన్‌సందర్భంగా వ్యాపార సంస్థ లన్నీ ఉదయం 9.45 గంటలకు మూసివేయాలని కౌటాల పోలీసులు వ్యాపారులకు సూచించారు. 10 గంటల తరువాత ఎవరైనా కనిపించినట్లయితే చర్యలు తీసుకుంటామని, వ్యాపారులందరు 10గం టల లోపు ఇళ్లకు చేరుకోవాలన్నారు.

వాంకిడి: మండలంలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు సీఐ సుధాకర్‌ పేర్కొన్నారు. గురువారం మండలకేంద్రంలో లాక్‌డౌన్‌ సమ యంలో బయట తిరుగుతున్న పదివాహనాలను సీజ్‌చేసినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-05-21T04:20:57+05:30 IST