లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుంటే కఠినచర్యలు

ABN , First Publish Date - 2021-05-21T07:09:18+05:30 IST

ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుంటే వాహనాలు సీజ్‌ చేయడంతో పాటు కఠినచర్యలు తప్పవని ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీ ణ్‌కుమార్‌ హెచ్చరించారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుంటే కఠినచర్యలు
లాక్‌డౌన్‌ అమలు పరిశీలిస్తున్న ఎస్పీ

నిర్మల్‌ కల్చరల్‌, మే 20 : ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుంటే వాహనాలు సీజ్‌ చేయడంతో పాటు కఠినచర్యలు తప్పవని ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీ ణ్‌కుమార్‌ హెచ్చరించారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో లా క్‌డౌన్‌ ఈ నెల 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని అన్నారు. 9వ రోజు ఆ యన లాక్‌డౌన్‌ అమలు తీరు పరిశీలించారు. బస్టాండ్‌, మంచిర్యాల్‌ చౌరస్తా తదితర ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. పటిష్ట బందోబస్తుపై సూచనలు చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, మాస్క్‌లు తప్పనిసరిగా ధరిం చాలని అన్నారు. రెండో దశ కరోనా సవాలుగా మారిందని, వేలాది మంది ప్రా ణాలతో చెలగాటమాడుతుందని గటి ్టగా ఎదుర్కోవాలని అన్నారు. ప్రజలు దుకా ణాలు, మార్కెట్‌ ప్రాంతాల్లో గుమిగూడరాదని, భౌతికదూరం పాటించాలని కోరారు. నిబంధనలు విస్మరిస్తే కేసులు తప్పవని అన్నారు. లాక్‌డౌన్‌ నిబం ధనలు పాటించి పోలీస్‌ అధికారులకు సహకరించి కరోనా మహమ్మారి నుండి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-05-21T07:09:18+05:30 IST