లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-19T03:58:40+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసు చెక్‌పోస్టును ఏసీపీ నరేందర్‌తో కలిసి సందర్శించారు. వాహనదారుల గుర్తింపు కార్డు, ఇతర పత్రాలను పరిశీలించారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో పనులు ముగించుకోవాలని వాహనదారులకు సూచించారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న డీసీపీ

 మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి  

జైపూర్‌, మే 18 : లాక్‌డౌన్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసు చెక్‌పోస్టును ఏసీపీ నరేందర్‌తో కలిసి సందర్శించారు.  వాహనదారుల గుర్తింపు కార్డు, ఇతర పత్రాలను పరిశీలించారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో పనులు ముగించుకోవాలని వాహనదారులకు సూచించారు. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. శ్రీరాంపూర్‌ సీఐ సంజీవ్‌, జైపూర్‌ ఎస్సై రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

 నస్పూర్‌: సీసీసీ కార్నర్‌ వద్ద జాతీయ రహ దారిపై మంగళవారం వాహనాల తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో బయట ఎందుకు వచ్చారని పలువురు వాహనాల చోదకులను ఏసీపీ అఖిల్‌ మహా జన్‌ ప్రశ్నించారు. సరైన ఆధారాలు చూపని, సమాధా నాలు చెప్పని వారికి జరిమానాలు వేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసిందని, దీనికి ప్రజలందరూ సహకరించి వైరస్‌ను నియంత్రించాలని కోరారు.

 మంగళవారం నస్పూర్‌ పరిధిలో 30 మంది వాహనాల చోదకులకు జరిమానాలు వేశారు.  మంచి ర్యాల రూరల్‌ సీఐ కుమారస్వామి, ఎస్సై శ్రీనివాస్‌, అదనపు ఎస్సై హీమామోద్దిన్‌  పాల్గొన్నారు. 

 ఏసీసీ: ప్రజల సంక్షేమమే పోలీసుల బాధ్యత అని ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. మంగళవారం ఐబీ చౌరస్తాలో లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఏసీపీ మాట్లాడుతూ ప్రజల కోసం పోలీసులు గస్తీ కాస్తున్నారని, ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రజ లు ఇండ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మినహాయింపు ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని, ఇతరులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ సీఐ రాజు, ఎస్సై శివకేశవులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.  

Updated Date - 2021-05-19T03:58:40+05:30 IST