పల్లె పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-06-24T05:06:06+05:30 IST

పల్లెల్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని అదనపుకలెక్టర్‌ రాజేశం అన్నారు.

పల్లె పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలి
పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటుతున్న అదనపు కలెక్టర్‌ రాజేశం

- అదనపు కలెక్టర్‌ రాజేశం

కెరమెరి, జూన్‌ 23: పల్లెల్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని అదనపుకలెక్టర్‌ రాజేశం అన్నారు. బుధ వారం ఆయన మండలకేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పల్లెప్రకృతివనంలో అన్నిరకాల మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణంను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రి ఆవరణల్లో మొక్కలు నాటి పచ్చధనాన్ని పెంపొందించాలన్నారు. పారిశుధ్యంపై అలసత్వం వహిస్తేచర్యలు తప్పవన్నారు. అనంతరం కెరమెరి గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు కాలినడకన వెళ్లి దారి పొడవున శానిటేషన్‌ను పరిశీలించారు. పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేయాల న్నారు. గ్రామీణప్రాంతాల్లో పచ్చధనం, పారిశుధ్యంపై ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే కోటారి- కేస్లాగూడ వరకు ప్రధానరోడ్డుపై మూడు వరుసల మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అనం తరం ఆస్పత్రిని సందర్శించి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. అనంతరం పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. జడ్పీసీఈవో రత్నమాల, అడిష నల్‌ డీఆర్డీవో కుటుంబరావు, ఎంపీడీవో దత్తారాం, తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ఖాన్‌, ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ ద్రుపతాబాయి, ఎంపీటీసీఇఫ్తెకార్‌ అహ్మద్‌, సర్పంచ్‌ బయ్యనబాయి, ఉత్తంరాథోడ్‌ ఉన్నారు.

Updated Date - 2021-06-24T05:06:06+05:30 IST