డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-08-21T05:50:40+05:30 IST

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్న డెంగ్యూ వ్యాధి నిర్మూలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బీజేపీ కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్‌ రావుల రాంనాథ్‌ శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఉత్తరం రాశారు.

డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి


ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిన రావుల రాంనాథ్‌
నిర్మల్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్న డెంగ్యూ వ్యాధి నిర్మూలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బీజేపీ కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్‌ రావుల రాంనాథ్‌ శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఉత్తరం రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డెంగ్యూ వ్యాధితో చాలా మంది మృతి చెందుతున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు బాగులేని నిరుపేదలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సలు చేసుకోవడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌ కాలనీలో మురికి కాలువలు శుభ్రం లేకపోవడంతో డెంగ్యూ బారిన చాలా మంది ప్రాణాలు కోల్పోపోతున్నారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని చర్యలు చేపట్టాలని కోరారు.

Updated Date - 2021-08-21T05:50:40+05:30 IST