ఇంటర్‌ విద్యార్థులతో రాష్ట్ర సర్కార్‌ చెలగాటం

ABN , First Publish Date - 2021-12-25T05:58:22+05:30 IST

ఇంటర్‌ విద్యా ర్థుల జీవితాలతో రాష్ట్ర సర్కారు చెలగాటమాడుతోంద ని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.

ఇంటర్‌ విద్యార్థులతో రాష్ట్ర సర్కార్‌ చెలగాటం
ప్రసంగిస్తున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్‌ విద్యా ర్థుల జీవితాలతో రాష్ట్ర సర్కారు చెలగాటమాడుతోంద ని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల విడుదలైన్‌ ఇం టర్‌ ఫలితాల్లో ఫెయిలైన వారు ఆత్మహత్యకు పాల్పడ డానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుం బాలకు ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కరోనాదృష్ట్యా ప్రత్యక్ష బోధన నిలిపివేసి ఆన్‌లైన్‌ తరగతులు చేపట్టగా.. సరైన సదుపాయాలు లేక అనేక మంది విద్యార్థులు పాఠాలు వినలేకపోయారన్నారు.  స్మార్ట్‌ఫోన్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడో దశ ఓమైక్రాన్‌ విజృంభిస్తున్నందు వల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు లాప్‌టాప్‌లు, ట్యాబ్లు, స్మార్ట్‌ ఫోన్లు అందజేసి విద్యాబోధన కొనసాగించాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-12-25T05:58:22+05:30 IST