ప్రత్యేక ఓటరు నమోదును విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-10-28T05:48:16+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్‌గోయల్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు నమోదు స్వీప్‌ కార్యక్రమాలు తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ప్రత్యేక ఓటరు నమోదును విజయవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అధికారులు

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 27: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్‌గోయల్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు నమోదు స్వీప్‌ కార్యక్రమాలు తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా, డ్రాప్ట్‌రోల్‌ పై చర్చించాలని, గరుడ యాప్‌ గురించి వివరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలలో స్వీప్‌ కార్యక్రమాలను స్థానిక విద్యాశాఖ, రెవెన్యూ, పంచాయతీ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటరు నమోదు, గరుడ యాప్‌ వినియోగం వంటి అంశాలపై వివరించడం జరిగిందన్నారు. బూత్‌ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎలక్టోరల్‌ లిటర్సి క్లబ్‌ల ఏర్పాటు, చునావ్‌ పాఠశాలల ఏర్పాటుపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజక వర్గాల్లో ఓటరు నమోదుకు 1819 దరఖాస్తులు రావడం జరిగిందని, వివిధ కారణాల వలన 509 దరఖాస్తులను రిజక్ట్‌ చేయడం, 1050 దరఖాస్తులను అప్‌డేట్‌ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్‌ నటరాజ్‌, స్వీప్‌ కోర్‌ కమిటీ సభ్యులు ఎన్‌.భీంకుమార్‌, స్వీప్‌ నోడల్‌ అధికారి లక్ష్మణ్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, అర్బన్‌ తహసీల్దార్‌ భోజన్న, ఎన్నికల విభాగం నాయిబ్‌ తహసీల్దార్లు సాయిమహేశ్‌, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:48:16+05:30 IST