అనాథ పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌

ABN , First Publish Date - 2021-05-06T04:32:35+05:30 IST

కొవిడ్‌ బారిన పడిన అనాథ లేదా అత్యవసరమైనటువంటి పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. బుధవారం హెల్ప్‌లైన్‌ ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 04023733665 ద్వారా కొవిడ్‌తో బాధపడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో ఆడపిల్లలకు, మగ పిల్లలకు ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేస్తామన్నారు. వారికి ఆహార, పోషణ సరుకులు అందిస్తామని తెలిపా రు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి కుటుంబసభ్యులు, బంధువుల వద్ద ఉన్న పిల్లలకు ఆర్థిక సహాయం నెలకు రూ.2వేల చొప్పున ఇస్తామన్నారు.

అనాథ పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌

ఆదిలాబాద్‌టౌన్‌, మే5: కొవిడ్‌ బారిన పడిన అనాథ లేదా అత్యవసరమైనటువంటి పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. బుధవారం హెల్ప్‌లైన్‌ ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 04023733665 ద్వారా కొవిడ్‌తో బాధపడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో ఆడపిల్లలకు, మగ పిల్లలకు ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేస్తామన్నారు. వారికి ఆహార, పోషణ సరుకులు అందిస్తామని తెలిపా రు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి కుటుంబసభ్యులు, బంధువుల వద్ద ఉన్న పిల్లలకు ఆర్థిక సహాయం నెలకు రూ.2వేల చొప్పున ఇస్తామన్నారు. 


Updated Date - 2021-05-06T04:32:35+05:30 IST