లీకేజీలపై ప్రత్యేక దృష్టి: మున్సిపల్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2021-10-14T05:48:14+05:30 IST

మున్సిపల్‌ పరిధిలోని సెంటర్‌ సిటీ వాటర్‌ లికేజీలతో పాటు జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో పైపులైన్‌ లీకేజీల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ అన్నారు.

లీకేజీలపై ప్రత్యేక దృష్టి: మున్సిపల్‌ చైర్మన్‌

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 13: మున్సిపల్‌ పరిధిలోని సెంటర్‌ సిటీ వాటర్‌ లికేజీలతో పాటు జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో పైపులైన్‌ లీకేజీల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ అన్నారు. బుధవారం వినాయక్‌చౌక్‌లో ప్రధాన రోడ్డుపై పట్టణానికి అందించాల్సిన నీరు వృథాగా పోతున్న విషయం పరిశీలించారు. గత రెండు రోజులుగా లీకేజి పైపుల తవ్వకాలను చూసిన ఆయన పనులు పూర్తి చేసే క్రమంలో దగ్గరుండి చర్యలు తీసుకున్నారు. తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా దసరా, బతుకమ్మ పండుగలకు ప్రజలకు పూర్తి స్థాయిలో నీరందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం సంజయ్‌నగర్‌లోని బతుకమ్మగాటు పనులను చైర్మన్‌ సభ్యులతో కలిసి పరిశీలించారు. రూ.20లక్షలతో ఘాట్‌లో శుద్ధిచేసి సుందరీకరణ పనులతో పాటు లైటింగ్‌,విద్యుత్‌ దీపాల ఏర్పాటును పరిశీలించారు. ఇందులో కౌన్సిలర్లు సందనర్సింగ్‌, పలువురు నాయకులు, మున్సిపల్‌ అధికారులున్నారు.

Updated Date - 2021-10-14T05:48:14+05:30 IST