కరోనా బాధితులకు ప్రత్యేక అంబులెన్స్‌

ABN , First Publish Date - 2021-05-20T05:30:00+05:30 IST

కరోనా బాధితుల కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌ను ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టోల్‌ ఫ్రీ 9515060231 నెంబర్‌కు కాల్‌ చేసిన వెంటనే అంబులెన్స్‌ వారి ఇంటికి వెళ్తుందన్నారు.

కరోనా బాధితులకు ప్రత్యేక అంబులెన్స్‌
అంబులెన్స్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌ అర్బన్‌, మే 20: కరోనా బాధితుల కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌ను ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టోల్‌ ఫ్రీ 9515060231 నెంబర్‌కు కాల్‌ చేసిన వెంటనే అంబులెన్స్‌ వారి ఇంటికి వెళ్తుందన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లడం, తీసుకు రావడం లాంటి పనులు నిర్వహించనుందని తెలిపారు. అత్యవసర సమయంలో పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ భరత్‌కుమార్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్‌, మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-20T05:30:00+05:30 IST