డిసెంబర్‌లోగా పోడుభూముల సమస్య పరిష్కారం

ABN , First Publish Date - 2021-11-02T06:27:07+05:30 IST

వచ్చే నెల డిసెంబర్‌ లోగా పోడు భూముల సమస్య పరిష్కారం చేయటం జరుగుతుందని, ఈ నెల 8 నుండి వచ్చే నెల 8 వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవటం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీశాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

డిసెంబర్‌లోగా పోడుభూముల సమస్య పరిష్కారం
మస్కాపూర్‌లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి 

రాష్ట్ర దేవాదాయ, న్యాయ,అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

ఖానాపూర్‌ రూరల్‌, నవంబర్‌ 1 : వచ్చే నెల డిసెంబర్‌ లోగా పోడు భూముల సమస్య పరిష్కారం చేయటం జరుగుతుందని, ఈ నెల 8 నుండి వచ్చే నెల 8 వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవటం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీశాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఖానాపూర్‌ మండలం లోని మస్కాపూర్‌ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నియోజకవర్గస్థాయి విజయగర్జన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యఅఽథితిగా హాజరై మాట్లాడారు. అడవులు పెరిగితేనే స్వచ్చమైన గాలి ఉటుందని, ఆర్‌ఓ ఎఫ్‌ఆర్‌ సమస్య పరిష్కారం అయిన తరువాత అడవి  పూర్తి స్థాయిలో హద్దులు ఏర్పాటు చేయటం జరుగుతుదని అన్నారు. మొక్కలను ప్రతీఒక్కరు నాటాలని, చెట్లు పెరిగితేనే ముందు తరాలకు మంచి జరుగుతుందని అన్నారు. ఈ నెల 15న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు నియోజకవర్గం నుండి 10 వేలకు పైగా ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రేఖానాయక్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సభలో కృతజ్ఞతలు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌, మాజీ జడ్‌పీటీసీ రాథోడ్‌ రామునాయక్‌, ఎంపీపీ అబ్ధుల్‌ మోహిద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేందర్‌, మార్కెట్‌ కమీటీ చైర్మన్‌ వెంకాగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు ఆమంద శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమీటీ చైర్మన్‌ కల్వకుంట్ల నారాయణ, నాయకులు పాకాల రాంచందర్‌, ఆకుల వెంకాగౌడ్‌, రాజేశ్వర్‌గౌడ్‌, పరిమి సురేష్‌, రాజ గంగన్న, సతీష్‌, శోభన్‌, చరణ్‌, వాల్‌సింగ్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీ టీసీలు, జడ్‌పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-02T06:27:07+05:30 IST