కొమరం భీంకు ఘన నివాళులు
ABN , First Publish Date - 2021-10-22T05:05:09+05:30 IST
మండల కేంద్రంలో కొమరం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం నిజాం సర్కారుపై పోరాడిన గిరిజన పోరాట యోధుడు కొమరం భీం అని కొనియాడారు.
సిరికొండ, అక్టోబరు 21: మండల కేంద్రంలో కొమరం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం నిజాం సర్కారుపై పోరాడిన గిరిజన పోరాట యోధుడు కొమరం భీం అని కొనియాడారు. కొమురం భీం స్ఫూర్తితో ఆదివాసీ హక్కులను సాధించడానికి ప్రతి గిరిజన పౌరుడు నడుం భిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం ఆశయ సాధన కమిటీ మండల అధ్యక్షుడు కోట్నాక్ పాండు, కన్నా పూర్ సర్పంచ్ కుమ్ర రఘురాం, ఎంపీపీ పెందూర్ అమృత్‌రావ్, తు డుందెబ్బ మండల అధ్యక్షుడు యాదవ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ: కొమరం భీం వర్ధంతిని గురువారం మండల కేంద్రం లోని ఆదివాసి భవన్‌లో గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన విధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్య క్రమంలో తుడుం దెబ్బ అధ్యక్షుడు జుగ్నక్ సంభన్న, జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్ తదితరులు ఉన్నారు.
భీంపూర్: మండలంలోని మర్కగూడ గ్రామంలో ఆదివాసీలు కొమరంభీం వర్ధంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా భీం విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలతో నివాళుర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, స్థానిక సర్పంచ్ మడావి సునీత, భీంపూర్ సర్పంచ్ మడావి లింబాజి, ఆదివాసీ నాయకులు మాణిక్‌రావ్, తెలంగ్‌రావ్, నగేష్, ఆదివాసీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
కొమరం భీం విగ్రహావిష్కరణ
ఇచ్చోడరూరల్, అక్టోబరు 21: మండలంలోని మన్కాపూర్‌లో నిర్మించిన కొమరంభీం విగ్రహాన్ని గురువారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షుడు కొడప జలైజాకు, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడప నగేష్, ఎంపీపీ