గుట్టుగా నకిలీ విత్తనాల దందా

ABN , First Publish Date - 2021-05-31T03:37:22+05:30 IST

వానాకాలం సీజన్‌కు ముందే అను మతి లేని విత్తనాల దందా మొదలైంది. నకిలీ కంపెనీ విత్తనాలను తీసుకువచ్చి రైతులకు అంటగడుతూ కొం దరు వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామాల్లో తమకు తెలిసిన వారిని ఏజెంట్లుగా నియమించుకుని అక్రమ రవాణాకు తెరలేపు తున్నారు. బీటీ 3, గ్లైసిల్‌ విత్తనాలపై ప్రభుత్వం నిషేధం విధించగా ఇదే రకం విత్తనాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

గుట్టుగా నకిలీ విత్తనాల దందా
అనుమతి లేని విత్తన ప్యాకెట్లు, నిందితులతో పోలీసులు

 అనుమతి లేని విత్తనాల అక్రమ రవాణా 

 అంతర్రాష్ట్ర వంతెన మీదుగా సరఫరా 

 జిల్లాకు చేరుతున్న విత్తనాలు 

 సీజన్‌కు ముందే పట్టుబడుతున్న వైనం

 కోటపల్లి, మే 30 : వానాకాలం సీజన్‌కు ముందే అను మతి లేని విత్తనాల దందా మొదలైంది. నకిలీ కంపెనీ విత్తనాలను తీసుకువచ్చి రైతులకు అంటగడుతూ కొం దరు వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామాల్లో తమకు తెలిసిన వారిని ఏజెంట్లుగా నియమించుకుని అక్రమ రవాణాకు తెరలేపు తున్నారు. బీటీ 3, గ్లైసిల్‌ విత్తనాలపై ప్రభుత్వం నిషేధం విధించగా ఇదే రకం విత్తనాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కిలోల చొప్పున బస్తాల్లో, ఆకర్షణీయం గా ప్యాకింగ్‌లోను వీటిని విక్రయిస్తున్నారు. ఈ విత్తన సాగులో కలుపు నియంత్రణకు ఉపయోగించే గ్లైసోసెల్‌  (గడ్డి నివారణ మందు) ఉండడం, దీని వల్ల పర్యావ రణంతోపాటు భూసారం దెబ్బతినడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విత్తనాలను నిషేధించాయి. కానీ కలుపు బెడద ఉండకపోవడమే ఈ విత్తనాలకు డిమాండ్‌ ఉం డగా వీటిని నిషేధించినా అక్రమ మార్గాన కొందరు వ్యాపారులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

అంతర్రాష్ట్ర వంతెన మీదుగా

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి అనుమతి లేని విత్తనాలు కోటపల్లి మండలం రాపన్‌పల్లి వద్ద ప్రాణహిత నదిపై నిర్మించిన అంతర్‌ రాష్ట్ర వంతెన మీదుగా జిల్లాకు చేరుతున్నాయని తెలుస్తోంది.  గుం టూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన పలు వురు వ్యాపారులు అక్రమంగా వీటిని సరఫరా చేస్తు న్నారు. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన వ్యాపారులు రూ.3 లక్షల విలువైన అనుమతి లేని విత్త నాలను తరలిస్తూ కోటపల్లి మండలంలో పోలీసులకు పట్టుబడ్డారు. 1.80 క్వింటాళ్ల విత్తనాలను 400 ప్యాకె ట్లుగా ఏర్పాటు చేసి ఒక్కో ప్యాకెట్‌లో 450 గ్రాములతో తయారుచేశారు. మహారాష్ట్ర నుంచి తెచ్చి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు విత్త నాలు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ ఘటనతోనే అక్రమ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  ఈ నెల 24న మందమర్రిలోను రూ. 5 లక్షల విలువైన అనుమతి లేని విత్తనాలను తీసుకువచ్చిన వ్యాపారి పోలీసులకు పట్టుబడ్డాడు. 

రెట్టింపు ధరలతో

రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుంటున్న దళా రులు అక్రమ మార్గాన అనుమతి లేని విత్తనాలను సరఫరా చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతాల నుంచి వీటిని కిలోకు రూ.800 నుంచి వెయ్యి కొనుగోలు చేసి ఇక్కడ కిలోకు రూ. 2 వేల నుంచి 2,500ల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పత్తి సాగు అధికంగా ఉండడం, చీడపీడల నుంచి తట్టుకునేందుకు, కలుపు మందును తట్టుకునే సామర్ధ్యం ఈ విత్తనాలకు ఉండడంతో గ్లైసిల్‌ విత్తనాల వైపు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పైగా దిగుబడి అధికంగా వస్తుందని రైతులను నమ్మించి విత్తనాలు అంటగడు తున్నట్లు సమాచారం.   

Updated Date - 2021-05-31T03:37:22+05:30 IST