నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-07T07:24:32+05:30 IST

జిల్లాలో కొలువైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో గురువారం నుండి శరన్నవరాత్రుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
దుర్గామాత ఆలయం

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 6 : జిల్లాలో కొలువైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో గురువారం నుండి శరన్నవరాత్రుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆషాడశుద్ధ పాడ్యమి నుండి ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నవమి వరకు కొనసాగు తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు సరస్వతి అమ్మవారు, దుర్గామాతకు ప్రత్యేక పూజలు నివేదిస్తారు. గురువారం ప్రాతఃకాలం 5:40 గంటలకు శ్రీ భవాని మాలధారణతో ప్రారంభిస్తారు. 13న రాత్రి మహిషాసుర దహనం చేయ నున్నారు. 15న సాయంత్రం 4:30  గంటలకు శమీపూజకు ఏర్పాట్లు చేస్తున్నా రు. దుర్గామాతకు నిత్యార్చనలు, అభిషేకాలు, తులాభారం, లలితాసహస్రనామ పారాయణం, అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపడతారు. తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో రోజుకొక్క రంగుచీరలో వివిధ అవతారాల్లో దర్శనమిస్తుంది. బాలా త్రిపురసుందరి, గాయత్రిమాత, శ్రీమహలక్ష్మి, లలితాంబి కాదేవి, మాతాన్నపూర్ణేశ్వరి, సరస్వతి, మహిషాసురమర్ధిని దేవిగాను, భద్రకాళీ మాత, చివరిరోజు శ్రీరాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమీయనుంది. దసరా పండుగ సందర్భంగా నిర్మల్‌ ప్రజలు బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయం లో అమ్మవారిని దర్శనం చేసు కోవడంతో పాటు అక్కడ నిర్వహించే రావణ దహనం ఆసక్తిగా తిలకిస్తారు. 

మంత్రికి ఆహ్వానం అందజేత

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 5 : దుర్గామాత నవరాత్రి ఉత్సవా లకు హాజరు కావాలని కోరు తూ బుధవారం మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డికి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండాజీ వెంకటా చారి ఆహ్వానాన్ని అందజేశారు. సింగిల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ లక్కడి జగన్మోహన్‌ రెడ్డి, మధుసూదనాచారి ఆయన వెంట ఉన్నారు. 

Updated Date - 2021-10-07T07:24:32+05:30 IST