ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
ABN , First Publish Date - 2021-08-25T06:10:19+05:30 IST
సెల్ఫీ సరదా ఒకరి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి.. కాలు జారి చెరువులో పడి మృతి చెందిన ఘటన జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.

మావల, ఆగస్టు 24: సెల్ఫీ సరదా ఒకరి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి.. కాలు జారి చెరువులో పడి మృతి చెందిన ఘటన జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని న్యూహౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన సాయితేజ(17) ఇంటర్ చదువుతున్నాడు. మంగళవారం స్నేహితులతో కలిసి సరదాగా మావల చెరువుకు స్నానానికి వెళ్లాడు. ఈ సందర్భంగా చెరువు వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారి సాయితేజ మునిగి పోయాడు. భయాందోళనకు గురైన తోటి స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయితేజ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.