సీనియర్‌ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-03-15T05:10:34+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఆదివారం జిల్లా స్థాయి సీనియర్స్‌ కబడ్డీ జట్ల ఎంపికను నిర్వహించారు. దీనికి కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్‌రెడ్డి హాజరై ప్రారంభించారు.

సీనియర్‌ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి14: జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఆదివారం జిల్లా స్థాయి సీనియర్స్‌ కబడ్డీ జట్ల ఎంపికను నిర్వహించారు. దీనికి కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని క్రీడాకారులు ప్రతి రోజూ సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. సచిన్‌టెండుల్కర్‌ అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు రెగ్యులర్‌గా సాధన చేసేవాడని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని కబడ్డీ క్రీడాకారులు సాధన చేయాలని కోరారు. ఇందులో గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, సభ్యులు రాష్ట్రపాల్‌, సాయికుమార్‌, విఠల్‌రెడ్డి, వెంకట్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-03-15T05:10:34+05:30 IST